గగుర్పొడిచే ఆకారాన్ని కోసేశారు! | Sakshi
Sakshi News home page

గగుర్పొడిచే ఆకారాన్ని కోసేశారు!

Published Sun, Oct 2 2016 6:11 PM

గగుర్పొడిచే ఆకారాన్ని కోసేశారు!

డెవోన్: ఫ్రాన్స్- ఇంగ్లాండ్ ల మధ్యనున్న ఇంగ్లీష్ చానెల్ లో తేలుతూ పర్యాటకులను, నావికులను గగుర్పాటుకు గురిచేసిన భారీ తిమింగలం కళేబరాన్ని అధికారులు ఒడ్డుకు తీసుకొచ్చారు. 50 అడుగుల పొడవున్న ఈ తిమింగలం కొద్ది రోజుల కిందట చనిపోయింది. లోపలుండే వాయుల కారణంగా దాని ఉదరబాగం క్రమక్రమంగా ఉబ్బిపోతూ సముద్ర ఉపరితలంపై భయంకరంగా తేలుతూ కనిపించేది. (గగుర్పాటుకు గురిచేసిన వింత ఆకారం..) అది సముద్రంలోనే పేలిపోతుందేమోనని భయంతో గురువారం ఆ తిమింగలాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. జంతుకళేబరాల నిర్వీర్యంలో నిష్ణాతులను పిలిపించి, భారీ తిమింగలాన్ని ముక్కలుముక్కలుగా కోయించారు. పొట్ట భాగాన్ని కోయగానే లోపలున్న వాయువులు ఒక్కసారిగా బయటికొచ్చాయి.
 
కాగా, ఇంగ్లండ్ తీరప్రాంతాల్లో తిమింగలాలు చనిపోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఐదు తిమింగలాలు సముద్రంలోనే ప్రాణాలు కోల్పోయాయి. ప్రమాదకర రసాయన వ్యార్థాలను సముద్రంలో కలపడం వల్లే అరుదైన జలచరాలు మృత్యువాత పడుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలల కిందట ఆస్ట్రేలియా తీరంలోనూ ఇలాంటిదే ఓ భారీ తిమింగలం కళేబరం.. అటుగా వెళ్లినవారిని కలవరపాటుకుగురిచేసింది.

Advertisement
Advertisement