నిర్భయ కేసు తీర్పుపై న్యాయనిపుణులు | Sakshi
Sakshi News home page

నిర్భయ కేసు తీర్పుపై న్యాయనిపుణులు

Published Mon, Sep 16 2013 3:00 AM

Delhi gangrape verdict: Confirmation might take a year

 న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అమలు కావడానికి కనీసం ఏడాది పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో ఎలాగూ ఈ తీర్పును సవాల్ చేస్తారు కాబట్టి అవి తుది నిర్ణయానికి రావడానికి నెలల వ్యవధి పట్టవచ్చు. ఈ కేసుపై ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు త్వరగా విచారణ నిర్వహించినా.. తుది తీర్పు వెలువరించడానికి కనీసం నాలుగు నెలలు పట్టవచ్చని అంచనా. 
 
 పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నాగేంద్ర రాయ్ ఈ విషయమై మాట్లాడుతూ ‘కేసు మళ్లీ మొదటి నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. అధికారికంగా సాక్ష్యాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. దోషులుగా ఉరిశిక్ష విధించవచ్చా లేదా అనే విషయమై స్వతంత్రంగా ఒక నిర్ణయానికి రావాలి. ఈ కేసులో ఉరిని ధ్రువీకరించడానికి అవకాశాలు ఉండవచ్చు. ప్రస్తుతం హైకోర్టు దగ్గర మరణశిక్షల కేసులు భారీ సంఖ్యలో ఏమీ లేవు. ఇలాంటి పిటిషన్లపై అది త్వరగా నిర్ణయం తీసుకుంటుంది. ఈ కేసుపై న్యాయమూర్తులందరికీ అవగాహన ఉంది కాబట్టి నిర్ణయం త్వరగా జరగవచ్చు’ అని ఆయన వివరించారు.
 

Advertisement
Advertisement