డ్రోన్‌లు పూడ్చేస్తాయి.. | Sakshi
Sakshi News home page

డ్రోన్‌లు పూడ్చేస్తాయి..

Published Fri, Nov 13 2015 12:23 AM

డ్రోన్‌లు పూడ్చేస్తాయి.. - Sakshi

గుంతలమయమైన  రోడ్లతో  ఇబ్బందిపడుతున్నారా..? బైక్‌పై వెళితే మీ నడుముకు గ్యారంటీ లేకుండా పోతోందా..? ఎవరి సాయం లేకుండా కేవలం డ్రోన్లతోనే ఆ గుంతలు పూడ్చేందుకు, ఎప్పటికప్పుడు రహదార్లపై కన్నేసి ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన లీడ్స్ యూనివర్సిటీ రహదార్ల మరమ్మతులకు ఉపయోగించేందుకు డ్రోన్లకు సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసింది. రోడ్లపై ఉన్న పగుళ్లను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పూడ్చేందుకు మూడు రకాల డ్రోన్‌లను తయారుచేసినట్లు యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఫిల్ పర్నెల్ పేర్కొన్నారు.

ఎగురుతూ వెళ్లే ఈ డ్రోన్‌లు చిన్న చిన్న పగుళ్లను కూడా గుర్తించగలవని చెబుతున్నారు. రహదారిలో ఏర్పడిన గుంతలకు మాత్రమే ఇలాంటి డ్రోన్‌లను పరిమితం చేయకుండా వీధి దీపాలు, మురికి నీటి కాలువల లీకేజీలు గుర్తించేందుకు కూడా ఉపయోగించాలని శాస్త్రవేత్తలు చూస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement