5.5 శాతం వృద్ధి ఖాయం: రంగరాజన్ | Sakshi
Sakshi News home page

5.5 శాతం వృద్ధి ఖాయం: రంగరాజన్

Published Wed, Sep 4 2013 2:21 AM

5.5 శాతం వృద్ధి ఖాయం: రంగరాజన్

న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.5 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) సలహాదారు సీ రంగరాజన్ మంగళవారం స్పష్టం చేశారు. స్కోచ్ 33వ సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4-5 శాతం శ్రేణిలో నమోదవుతుందని, మొత్తం వృద్ధి రేటు పెరగడానికి ఇది దోహదపడే అంశమని ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు. వృద్ధికి ఎజెండాను సంస్కరణల ఎజెండా అని కూడా పేర్కొనవచ్చని ఆయన అన్నారు. రూపాయి క్షీణత, ద్రవ్యలోటు తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో డీజిల్ ధర పెంపును ఆయన సమర్థించారు. ఫారెక్స్ మార్కెట్‌లో స్థిరీకరణ నెలకొన్న తరువాత వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందని విశ్లేషించారు.  
 

Advertisement
Advertisement