ఎగుమతుల వృద్ధికి చర్యలు | Sakshi
Sakshi News home page

ఎగుమతుల వృద్ధికి చర్యలు

Published Thu, Oct 8 2015 1:25 AM

ఎగుమతుల వృద్ధికి చర్యలు

కేంద్రం హామీ ఎగుమతి సంఘాల ప్రతినిధులతో భేటీ
 
న్యూఢిల్లీ: తొమ్మిది నెలలుగా నిరాశ కలిగిస్తున్న ఎగుమతుల రంగానికి ఊపునివ్వడానికి త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. వడ్డీ సబ్సిడీ స్కీమ్ పొడిగింపు కూడా ప్రోత్సాహకాల్లో ఒకటిగా సూచనప్రాయంగా తెలి పింది. ఎగుమతుల వృద్ధి కోసం వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం ఇక్కడ ఒక అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. వాణిజ్యశాఖ కార్యదర్శి రీటా తియోటియా ఈ సమావేశంలో మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఎగుమతుల ప్రోత్సాహక పథకాలకు కేటాయింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.18,000 కోట్ల నుంచి రూ.21,000 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఎగుమతుల విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.

ప్రత్యేక ఆర్థిక జోన్లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధింపు, రుణ సమీకరణ అలాగే లావాదేవీల భారం అధికంగా ఉండడం వంటి అంశాలను ఈ సందర్భంగా పలు ఎగుమతి మండళ్ల ప్రతినిధులు ప్రస్తావించారు. ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న అంశాల్లో ఇవి కూడా ఉన్నాయని తెలిపారు. ఆయా అంశాలను ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకపోతే... గత ఆర్థిక సంవత్సరం  ఎగుమతుల విలువ 310.5 బిలియన్ డాలర్లను సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చేరుకోవడం కష్టమని కూడా అభిప్రాయపడ్డారు. ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఈ రంగం ప్రతినిధులు ఏమన్నారో చూస్తే...
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement