నోకియా సీఈవోకి భారీ వీడ్కోలు ప్యాకేజి | Sakshi
Sakshi News home page

నోకియా సీఈవోకి భారీ వీడ్కోలు ప్యాకేజి

Published Fri, Sep 20 2013 12:57 AM

fancy send off package   to nokia ceo

 న్యూయార్క్: మైక్రోసాఫ్ట్‌తో డీల్ సజావుగా ముగిస్తే.. నోకియా సీఈవో స్టీఫెన్ ఎలాప్‌కి బాగానే గిట్టుబాటు కానుంది. సీఈవో పదవి నుంచి అర్థంతరంగా తప్పుకోవాల్సి వస్తున్నందున పరిహారం కింద ఆయనకు దాదాపు 25.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 165 కోట్లు) ప్యాకేజి అందనుంది. ఇందులో 30 శాతాన్ని నోకియా, మిగతా 70 శాతాన్ని మైక్రోసాఫ్ట్ చెల్లిస్తాయి. నోకియాకి చెందిన హ్యాండ్‌సెట్స్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement