అవినీతిపై పోరాటం ఆగదు: మోదీ | Sakshi
Sakshi News home page

అవినీతిపై పోరాటం ఆగదు: మోదీ

Published Fri, Apr 7 2017 1:28 AM

అవినీతిపై పోరాటం ఆగదు: మోదీ - Sakshi

సాహిబ్‌గంజ్‌(జార్ఖండ్‌): అవినీతి, నల్లధనంపై పోరాటం ఆగదని ప్రధాని మోదీ పునరుద్ఘా టించారు. భారత్‌లో ప్రజాస్వా మ్యాన్ని ఈ రెండూ చెదపురుగుల్లా తొలిచేస్తున్నాయని, అయితే ప్రజల ఆశీస్సులతో దీనిపై పోరాటం కొనసాగిస్తానని గురువారం జార్ఖండ్‌ సాహిబ్‌ గంజ్‌లో జరిగిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత మోదీ చెప్పారు. ‘2022 నాటికి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది.

 ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ ఓ అడుగు ముందుకు వేస్తే దేశ అభివృద్ధి దిశగా 125 కోట్ల అడుగులు పడతాయి’అని అన్నారు. మరోకార్యక్రమంలో  స్వయం సహాయక బృందాలకు మొబైల్‌ ఫోన్లు అందించారు. పర్యటనలో భాగంగా ప్రధాని సాహిబ్‌గంజ్‌ వద్ద గంగానదిపై 4 లేన్ల వంతెన, 50 వేల లీటర్ల డైరీ ఫామ్‌కు శంకుస్థాపన చేశారు. 311 కిలోమీటర్ల గోవిందపూర్‌ – సాహిబ్‌గంజ్‌ రహదారిని ప్రారంభించారు.

పేదల కోసమే బీజేపీ..
పేదలు, అట్టడుగు వర్గాల వారికి సేవచేయడాన్ని బీజేపీ కొనసాగిస్తుందని మోదీ అన్నారు. గురువారం పార్టీ 37వ వ్యవస్థాపక దినం సందర్భంగా పార్టీ కార్యకర్తల కృషిని అభినందించారు.  బీజేపీ ప్రధాన కార్యాలయంలో దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌కు నివాళులు అర్పించారు. మరో ట్వీట్‌లో దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.  
 

Advertisement
Advertisement