ఎరక్కపోయి.. ఇరుక్కుంది | Sakshi
Sakshi News home page

ఎరక్కపోయి.. ఇరుక్కుంది

Published Wed, Jun 22 2016 8:54 PM

ఎరక్కపోయి.. ఇరుక్కుంది - Sakshi

అలబామా(యూఎస్): డైనోసర్ బోమ్మతలతో తన స్నేహితులను ఆటపట్టిద్దామనుకున్న ఓ బాలిక చివరకు అందులోనే ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో చివరకు పైర్ సిబ్బంది ఆ బొమ్మ నుంచి బాలికకు విముక్తి కల్పించారు. ఈ సంఘటన అలబామాలోని ట్రస్ విల్లేలో చోటుచేసుకుంది.  

డార్బీ రిస్నర్(15) డైనోసర్ తలతో ఉన్న ఉదారంగు బొమ్మను ధరించి తన స్నేహితులను ఆటపట్టించాలనుకుంది. బొమ్మతలను ధరించి సోఫా పక్కన కింద కూర్చొని పైన ఫ్లోర్ నుంచి వస్తున్న స్నేహితులకోసం వేచి చూసింది. అదే సమయంలో బొమ్మతల ఆమె భుజాల భాగంలో ఇరుక్కుంది.

చివరకు వాళ్లు కిందకు వచ్చి చూసేవరకు ఆమె బొమ్మతలలో భుజాల వరకు ఇరుక్కుపోవడాన్ని గమనించారు. ఆమె ఎంత ప్రయత్నించినా బొమ్మతలను తీయలేకపోయింది. ఏముంది ....వ్యాసిలేన్, ల్యూబ్రికెంట్లను రాసి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో స్నేహితులు తలా ఓ చెయ్యి వేశారు. కాళ్లు ఒకరు బొమ్మ తలను ఒకరు పట్టుకొని లాగారు. అయినా బొమ్మతల రాకపోవడంతో ఫైర్ సిబ్బందిని ఆశ్రయించారు. చివరకు ఫైర్ సిబ్బంది 45 నిమిషాలపాటూ కష్టపడి ఆమెకు బొమ్మతల నుంచి విముక్తి కల్పించారు. ఈ తతంగాన్నాంతా డార్జీ సోదరుడు వీడియో తీశాడు. ఇంకేముంది చూసిన వారంతా విరగబడి నవ్వుతున్నారు.

బొమ్మ తలను తీయడానికి ఆమె భుజాలకు వ్యాసిలేన్ ఎక్కువగా రాయడంతో.. గ్రీస్ రాసిన పందితో వ్రెస్లింగ్ చేసినట్టుందని ఫైర్ సిబ్బంది సభ్యుల్లో ఒకరు విరగబడి నవ్వుతూ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement