అసెంబ్లీ ఐదు రోజులే | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఐదు రోజులే

Published Tue, Aug 18 2015 1:58 AM

Five days Assembly

31వ తేదీనుంచి వచ్చే నెల 4 వరకే సమావేశాలు
ముఖ్యమంత్రి ఆమోదానికి ఫైలు

 
హైదరాబాద్: రాష్ట్రంలో ఒక పక్క కరువు, రైతుల ఆత్మహత్యల వంటి ప్రధాన సమస్యలు, మరోపక్క ప్రభుత్వ నిర్వాకంతో గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతి చెందడం, పట్టిసీమలో మోసాలు లాంటి పలు కీలకాంశాలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులతో ముగించేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలు వచ్చే నెల 4వ తేదీతో ముగియనున్నాయి.

ఇందుకు సంబంధించిన ఫైలుకు ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ఆమోదం తెలిపి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల శాసనసభ స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో తాము అసెంబ్లీలో ప్రస్తావించనున్న సమస్యలను పేర్కొన్న విషయం తెలిసిందే.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement