ప్రీమియం చిన్న కార్లపై దృష్టి | Sakshi
Sakshi News home page

ప్రీమియం చిన్న కార్లపై దృష్టి

Published Wed, Jan 22 2014 12:32 AM

ప్రీమియం చిన్న కార్లపై దృష్టి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న కార్లలో ప్రీమియం సెగ్మెంట్‌పై టాటా మోటార్స్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రీమియం హాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో విస్టా వీఎక్స్‌టెక్‌ను, నానో కార్ల విభాగంలో న్యూ నానో ట్విస్ట్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో టాటా మోటార్స్ నేషనల్ సేల్స్ హెడ్ ఆశిష్ ధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ 8 శాతం వాటాను కలిగి ఉందని, ఈ కొత్త మోడల్స్‌తో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
 
 ప్రతీ నెలా విస్టా 800 కార్ల అమ్మకాలతో హైదరాబాద్ అతిపెద్ద మార్కెట్‌గా ఉందని, తాజా కొత్త మోడల్‌తో ఈ అమ్మకాల సంఖ్య రెట్టింపు అవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. టచ్‌స్క్రీన్‌తో కూడిన మల్టీ మీడియా, జీపీఎస్ నావిగేషన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ వంటి సౌకర్యాలు కలిగిన విస్టా వీఎక్స్ టెక్ ధరల శ్రేణి  (హైదరాబాద్ ఎక్స్ షోరూం) రూ. 4.96 లక్షల నుంచి రూ. 6.11 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. న్యూ నానో ట్విస్ట్ ధర రూ. 2.46 లక్షలుగా ఉంది. అధిక మైలేజ్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ (ఈపీఏఎస్) వంటి ఫీచర్స్‌ను నానో ట్విస్ట్‌లో పొందుపర్చినట్లు ఆశిష్ తెలిపారు.

Advertisement
Advertisement