Sakshi News home page

ఆత్మరక్షణ కోసమే నయీంపై కాల్పులు!

Published Mon, Aug 8 2016 8:23 PM

ఆత్మరక్షణ కోసమే నయీంపై కాల్పులు! - Sakshi

మహబూబ్నగర్ : మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్, మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'నిన్న రాత్రి  వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని, ఎండీవర్ను వెంబడించాం. అయితే, కారులోని వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తే నయీం అని తర్వాత తేలింది' అని ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు.

నయీంకు ఎన్నో కేసుల్లో ప్రమేయం ఉందని, చాలాకాలంగా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, నయీం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నయీం ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్ వాహనాన్ని (AP 28 DR 5859) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం వడ్డేపల్లి నర్సింగరావు పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది.

గత కొన్ని ఏళ్లుగా నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారిన నయీం పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు, రాజకీయ నాయకులూ సైతం ఉలిక్కిపడతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 50కి పైగా హత్యలు, పలు బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నక్సలైట్గా తన జీవిత ప్రస్థానం ప్రారంభించిన నయీం అనంతరం హత్యలు, దోపిడీలు, దందాలతో కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంటిపై పోలీసుల జరిపిన దాడిలో పట్టుబడ్డ డబ్బును లెక్కించడానికి 4 క్యాష్ కౌంటింగ్ మిషన్లు వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే నయీం ఆర్థిక పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు.

నయీం 'సాక్షి' వెబ్‌సైట్‌ సమగ్ర కథనాలు ఇవి..!

1. ఎవరీ నయీం?

2. షాద్ నగర్ లో కాల్పులు, నయీం హతం

3. 'పక్కా సమాచారంతోనే స్కెచ్'

4. నయీం జాడ ఎలా దొరికిందంటే..?

5. నయీం ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు!

6. నయీం చనిపోవడం ఆనందంగా ఉంది : సాంబశివుడు తండ్రి

7. పోలీసుల అదుపులో నయీం కుటుంబసభ్యులు

Advertisement

తప్పక చదవండి

Advertisement