పేద పిల్లలకు ఉచితంగా ఇన్సులిన్ | Sakshi
Sakshi News home page

పేద పిల్లలకు ఉచితంగా ఇన్సులిన్

Published Sun, Dec 15 2013 8:02 PM

పేద పిల్లలకు ఉచితంగా ఇన్సులిన్

పిల్లల్లో మధుమేహం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతోంది. అయితే, ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఇన్సులిన్ లాంటి వాటిని కొనుక్కుని వాడటం చాలా కష్టం అవుతోంది. అలాంటివారిని ఆదుకోడానికి దేశ రాజధాని నగరంలో ఉన్న పేద పిల్లలకు ఉచితంగా ఇన్సులిన్ అందజేస్తామంటోంది ఢిల్లీకి చెందిన ఓ సంస్థ.  టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న 150 మంది పేద పిల్లలకు తాము ఉచితంగా ఇన్సులిన్ అందజేస్తామని ఢిల్లీ డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్ (డీడీఆర్సీ) తెలిపింది.

తాల్కతోరా స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో డీడీఆర్సీ ఈ ప్రకటన చేసింది. టైప్1 మధుమేహంతో బాధపడే పిల్లలకు ప్రతిరోజూ ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుందని, వారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పరిశీలిస్తూ దీన్ని అందజేయాలని, అలాగే వైద్యులకు కూడా తరచు చూపిస్తూ పాథాలజీ పరీక్షలు చేయించాలని.. బలహీన వర్గాల పిల్లలు ఇంత ఖర్చును భరించలేరని డీడీఆర్సీ చైర్మన్, మధుమేహ వైద్య నిపుణుడు అశోక్ ఝింగన్ తెలిపారు. అందుకే 0-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు ఉచితంగా ఇన్సులిన్ ఇస్తామన్నారు. మొదట 150 మందితో మొదలుపెట్టి క్రమంగా పిల్లలందరికీ ఇన్సులిన్ అందజేస్తామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement