రింగింగ్ బెల్స్ కథ ఇక కంచికేనా? | Sakshi
Sakshi News home page

రింగింగ్ బెల్స్ కథ ఇక కంచికేనా?

Published Thu, Dec 29 2016 6:07 PM

రింగింగ్ బెల్స్ కథ ఇక కంచికేనా?

నోయిడా:  ప్రపంచంలో అతి చవకైన ఫోన్ అంటూ ప్రకంపనలు పుట్టించిన రింగింగ్ బెల్స్  మరోసారి వార్తల్లో నిలిచింది.   రూ.251కే ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ అంటూ  దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిన   సంస్థ  సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ   మోహిత్  గోయల్ సంస్థ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.    అన్నదమ్ములు  మోహిత్,  అన్మోల్ మధ్య ఇటీవల  చెలరేగిన విభేదాల నేపథ్యంలో   మోహిత్ తో పాటు సంస్థ సీఈవో,  మోహిత్  భార్య ధార్న గోయల్  కూడా సంస్థకు రాజీనామా చేశారు.  దీంతో 2016   ఆరంభంలో(ఫిబ్రవరి)లో అలజడి రేపిన రింగింగ్ బెల్స్  కథ 2016 తో పాటే ముగిసిపోనుందా  అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే    ప్రస్తుతం రింగింగ్ బెల్స్‌కు మరో డైరెక్టర్ , మోహిత్ సోదరుడు అన్‌మోల్  కంపెనీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.  అలాగే అశోక్ చడ్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు తెలిపింది. తమ సంస్థ  కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని  అన్మోల వెల్లడించారు. తమ స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ తెలిపారు. మరోవైపు కంపెనీ నుంచి బయటకు వచ్చిన మోహిత్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్  ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక నూతన సంస్థను ప్రారంభించ బోతున్నట్టు  సమాచారం.
కాగా  అతి చవగ్గా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు రింగింగ్ బెల్స్ ప్రకటించడంతో దాదాపు ఏడుకోట్లకు పైగా ఈ మొబైల్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఏకంగా కంపెనీ అధికారిక వెబ్ సైట్ కూడా క్రాష్ అయింది.   అనంతరం  సీబీఐ దాడులు,ఆందోళన తదితర పరిణామాలు తెలిసిన విషయాలే.  అయితే  బుక్ చేసుకున్నవాళ్లల్లో ఎంతమందికి ఈ ఫోన్లను అందించిందీ స్పష్టత లేదు.

Advertisement
Advertisement