కొత్త బొమ్మ పడినా.. చూసే జనాలేరి? | Sakshi
Sakshi News home page

కొత్త బొమ్మ పడినా.. చూసే జనాలేరి?

Published Sat, Nov 12 2016 3:00 PM

కొత్త బొమ్మ పడినా.. చూసే జనాలేరి? - Sakshi

పెద్ద నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బగానే మారింది. గత మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో సినీ పరిశ్రమ బిత్తరపోయింది. ఆనవాయితీగా ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలో సందిగ్ధంలో పడే పరిస్థితి నెలకొంది. ఎలాగోలా అనుకున్న ప్రకారం కొన్ని సినిమాలు శుక్రవారం విడుదలైనా వాటిని పట్టించుకునే ప్రేక్షకుడే కరువయ్యాడు.

శుక్రవారంనాడు స్టార్‌ హీరో సినిమా విడుదల అనగానే థియేటర్ల వద్ద భారీ కోలాహలం ఉంటుంది. పండుగ వాతావరణం నెలకొంటుంది. కానీ శుక్రవారం దేశంలోని అన్నీ భాషల్లో సినిమాలు విడుదలైనా.. గతంలో కనిపించేంత సందడి ఇప్పుడు లేదని, చాలాచోట్ల సినిమాలు చూసేవారు కరువయ్యారని ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్ల జనం లేకపోవడంతో థియేటర్ల షోలు వేయాలా? వద్దా? అన్న దుస్థితి నెలకొంది.
 
పెద్దనోట్ల రద్దు వల్ల దాదాపు తెలుగురాష్ట్రాల్లో శుక్రవారం విడుదలైన సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడిందని అంటున్నారు. ఇక బెంగళూరులో అయితే థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థియేటర్ల వైపు వచ్చే జనమే లేకపోవడంతో అవి ఈగలను తోలుకుంటున్నాయి. షోలు వేసేందుకు తగిన టికెట్‌ మనీ కూడా రాకపోతుండటంతో ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు. 

Advertisement
Advertisement