ట్విట్టర్ వేదికగా మాల్యా ఆక్రోశం... | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ వేదికగా మాల్యా ఆక్రోశం...

Published Thu, Jan 26 2017 2:20 PM

ట్విట్టర్ వేదికగా మాల్యా ఆక్రోశం...

ముంబై: భారీ రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యా  సీబీఐ చార్జ్ షీటు దాఖలు, సెబీ నిషేధం, తదితర పరిణామాలపై స్పందించారు.   బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా చుట్టూ ఉచ్చుబిగుస్తూ ఉండడంతో  ట్విట్టర్ వేదికగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.  ప్రభుత్వ  ఆరోపణలన్నీ నిరాధారమైనవనీ, తనకే పాపం తెలియందంటూ పాత పల్లవే అందుకున్నారు.

మంత్రగత్తెను వేటాడినట్టు తనను వెంటాడుతున్నారంటూ గురువారం ట్విట్టర్ లో వాపోయారు. ఎలాంటి చట్టపరమైన సాక్ష్యాలు లేకుండానే అన్నివైపుల నుంచి వేటాడుతున్నారని వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. కింగ్ ఫిఫర్   అనేది తన సొంత ఆటబొమ్మకాదనీ,  దేశానికి ఎనలేని సేవ చేస్తున్న ఒక గొప్ప ప్రజా సేవల సంస్థ అని పేర్కొన్నారు.

గత 30 ఏళ్ల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద మద్యం కంపెనీని, బ్రేవరేజ్ కంపెనీని, ఎయిర్ లైన్స్ ను   అందించినందుకు  తనకీ గౌరవం దక్కిందన్నారు. కింగ్ ఫిషర్  ఆస్తులను మళ్లించినట్టు  సీబీఐ చెప్పడం,  యూ ఎస్ ఎల్ నుండి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు  నిధులను  తరలించినట్టు సెబీ చెప్పడం హాస్యాస్పస్పందంగా ఉందని ట్వీట్ చేశారు.

కాగా గత ఏడాదిలో  లండన్ కు పారిపోయిన మద్యం వ్యాపారిపై చర్యలకు ప్రభుత్వం వేగంగా కదులుతోంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ  చార్జిషీట్  దాఖలు చేసింది.   మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్  నిధులను "వ్యక్తిగత ఉపయోగం"  మళ్ళించినట్టు ఆరోపించింది. అలాగే  సోమవారం 2015 రుణ డిఫాల్ట్ కేసుకు సంబంధించి ఐడిబిఐ చైర్మన్ యోగేష్ అగర్వాల్, సహా తొమ్మిది మందిని అరెస్ట్  చేసింది. అటు యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ నుంచి నిధులను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణల కేసులో విజయ్‌ మాల్యా, మరో ఆరుగురిని సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ  వేటు వేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement