జియోనీ ఎం6 లాంచ్ ఆగస్టులో | Sakshi
Sakshi News home page

జియోనీ ఎం6 లాంచ్ ఆగస్టు

Published Thu, Jul 28 2016 2:26 PM

Gionee M6, M6 Plus unveiled in China; India launch expected in August

జియోనీ తన కొత్త స్మార్ట్  ఫోన్లు ఎం 6, ఎం 6 ప్లస్  లను చైనా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎం సిరీస్ మారథాన్ లో లాంగ్ బ్యాటరీ లైఫ్ పై దృష్టి పెట్టిన సంస్థ ఈ స్మార్ట్ ఫోన్లను  బీజింగ్ లో విడుదల చేసింది.  ఈ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్లను  ఆగ‌స్టు 6న విడుద‌ల చేయనుందని భావిస్తున్నారు. ప్ రపంచంలో ఇదే  మొదటి హైయ్యస్ట్ సెక్యూర్డ్ ఫోన్ అని చెబుతోంది.  అలాగే    64, 128 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్ వేరియెంట్స్ లో  విడుద‌ల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ సుమారు 29.229 64 జీబీ వేరియంట్  సుమారు రూ 27.212 గా లభించనుంది . యూజర్ల వ్యక్తిగత సమాచారమును రక్షించుకునే ఎన్క్రిప్టెడ్ చిప్ ను అమర్చినట్టు కంపెనీ  చోబుతోంది. అలాగే ఇతర దేశాల్లో ఇతర దేశాల్లో ఫింగర్ ప్రింట్,  స్కానర్, ప్రైవసీ ప్రొటెక్షన్,  మాల్వేర్ డిస్ట్రాక్షన్  అమర్చినట్టు తెలిపింది. గత 14సం.రాలుగా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో ఉన్నామని సంస్థ ప్రెసిడెంట్ విలియం లు చెప్పారు. టెక్నాలజికల్ ఇన్నోవేషన్, వినియోగదారుల ప్రయోజనాలు అనే  రెండు విషయాలు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.  ఈ అంశాలను  దృష్టిలో పెట్టుకొని  స్మార్ట్ ఫోన్ ను స్మైల్  ఫోన్ గా మార్చే  లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు.

జియోనీ ఎం6 ఫీచ‌ర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 × 1080 పిక్సెల్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్
1.8 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్
4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
13 మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.0
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్
 

Advertisement
Advertisement