ఫలితాల జోరుతో గీతాంజలి | Sakshi
Sakshi News home page

ఫలితాల జోరుతో గీతాంజలి

Published Wed, Sep 14 2016 4:06 PM

Gitanjali Gems Surges 20percent On Strong Q1 Earnings

ముంబై:  ఒకవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు  లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంటే ఆభరణాల షేర్లు మాత్రం బుధవారం నాటిమార్కెట్లో మెరుపులు మెరిపించాయి.  ప్రధానంగా  మంగళవారం ఫలితాలను ప్రకటించిన  గీతాంజలి జెమ్స్‌ షేరు   భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం  భారీ నికర లాభాలను ప్రకటించడంతో ఈ షేర్ 20 శాతం లాభాలతో  అప్పర్‌ సర్క్యూట్‌ను  తాకింది. ఈ జోరుతో తాజా జ్యువెలర్స్‌, పీసీ జ్యువెలర్స్‌, త్రిభువన్‌దాస్‌(టీబీజెడ్‌)  టైటన్‌, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌తదితర షేర్లు  దూసుకెళ్లాయి. . పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ పుత్తడి ధరలకు పాజిటివ్ సంకేతతమని  పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.

రుణాల ఖర్చు గణనీయంగా తగ్గిందని  సంస్థ సలహాదారు అభిషేక్ గుప్త తెలిపారు. , భవిష్యత్తులో మరింత సంస్థ  వడ్డీ ఖర్చు తదుపరి త్రైమాసికాల్లో మరింత దిగి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement