విభజన నివేదిక ఖరారుపై కొనసాగుతున్న కసరత్తు | Sakshi
Sakshi News home page

విభజన నివేదిక ఖరారుపై కొనసాగుతున్న కసరత్తు

Published Thu, Nov 21 2013 12:58 PM

GoM report in Cabinet next week

న్యూఢిల్లీ : నార్త్బ్లాక్లో జీవోఎం సమావేశం  ముగిసింది. రాష్ట్ర విభజనపై తుది నివేదిక విషయంలో జీవోఎం చర్చలు జరుపుతోంది. శుక్రవారం మరోసారి సమావేశం కావాలని జీవోఎం సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన విధివిధానాలపై.. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రిలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేసిన జీవోఎం.. గురువారం కూడా విభజన నివేదిక ఖరారుపై కసరత్తు కొనసాగింది. నివేదిక వచ్చేవారం కేంద్ర కేబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం.

అయితే కేంద్రమంత్రి చిదంబరం సింగపూర్‌ వెళ్లడంతో తుది నివేదిక విషయంలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.  భేటీ అనంతరం జీవోఎం సభ్యులు కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, జైరాం రమేష్తో కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం భేటీ అయ్యారు.  కాగా  జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకోవటంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్యాకేజీల కోసం తాము చేసిన డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement