ఉద్యోగినిపై లైంగిక వేధింపులు: ప్రభుత్వాధికారి అరెస్టు | Sakshi
Sakshi News home page

ఉద్యోగినిపై లైంగిక వేధింపులు: ప్రభుత్వాధికారి అరెస్టు

Published Fri, Sep 6 2013 8:52 PM

Govt official arrested for seeking sexual favours from junior

ప్రభుత్వాధికారిగా పనిచేస్తూ.. తన కింద పనిచేసే ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రబుద్ధుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది.

రాజస్థాన్ పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్న సదరు అధికారి, తన కింద పనిచేసే ఉద్యోగినిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ వర్గాలు అతగాడి కార్యాలయానికి వెళ్లి సోదాలు చేయగా, అక్కడ కొన్ని అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వస్తువులు లభించినట్లు ఏసీబీ ఐజీ స్మితా శ్రీవాత్సవ తెలిపారు.

Advertisement
Advertisement