ఆగస్టు చివరివారంలో జీఎస్‌ఎల్‌వీ డీ6 ప్రయోగం? | Sakshi
Sakshi News home page

ఆగస్టు చివరివారంలో జీఎస్‌ఎల్‌వీ డీ6 ప్రయోగం?

Published Thu, Jul 16 2015 2:11 AM

GSLV-D5 Twin may be Launched This Year

సూళ్లూరుపేట: సమాచార రంగంలో మరింత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ డీ6 ఉపగ్రహ వాహకనౌక ద్వారా జీశాట్-6 సమాచార ఉపగ్రహాన్ని ఆగస్టు చివరివారంలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక అనుసంధాన భవనంలో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ అనుసంధాన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
 
 2,200 కిలోలు బరువు కలిగిన జీశాట్-6 ఉపగ్రహం ఈ నెల 9న బెంగళూరు నుంచి శ్రీహరికోటకు చేరుకుంది. ఆగస్టు 30న ఈ ప్రయోగం చేపట్టాలనే లక్ష్యంతో ఇస్రో శాస్త్రవేత్తలు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. డిజిటల్ మల్టీమీడియా, మల్టీమీడియా మొబైల్ ఫోన్స్‌లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
 

Advertisement
Advertisement