జూలై 1 నుంచి జీఎస్‌టీ అమలు | Sakshi
Sakshi News home page

జూలై 1 నుంచి జీఎస్‌టీ అమలు

Published Tue, Feb 28 2017 12:19 PM

జూలై 1 నుంచి జీఎస్‌టీ అమలు

న్యూఢిల్లీ:  దేశంలో ఒక జాతి..ఒక పన్ను విధానానికి మార్గం సుగమం అయింది. గూడ్స్‌ అండ్‌ సర్వీసు వస్తు సేవల పన్ను  (జీఎస్‌టీ) అమలుకు   సర్వం సిద్ధమైనట్టు  ఆర్థిక వ్యవహారాలశాఖ  కార్యదర్శి శక్తి కాంత్‌ దాస్‌ మంగళవారం విలేకరులు తెలిపారు.  జులై 1, 2017 నుంచి జీఎస్‌టీ అమలు చేయనున్నట్టు  ఈ మేరకు అన్ని రాష్ట్రాలు అమోదం తెలిపినట్టు ఆయన  ప్రకటించారు.  దీని అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య  నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కారమైనట్టు తెలిపారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంస్కరణలను అమలు చేయనున్నట్టు తెలిపారు.

దీనిపై ఎనలిస్టులు హర్షం వ్యక్తం  చేశారు.  మరోవైపు జిఎస్‌టీ అమలుకు  లైన్‌ క్లియర్‌ కావడంతో మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా  లాజిస్టిక్‌ షేర్లు ర్యాలీ  అవుతున్నాయి.

కాగా దేశమంతటా ఏకరీతి పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత‍్వం రూపొందించినదే వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) బిల్లు.  దీన్ని అనుకున్న సమయానికి అమల్లోకి తేనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ​ జైట్లీ పదేపదే ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement