హిల్లరీపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

హిల్లరీపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Wed, Aug 10 2016 10:58 AM

హిల్లరీపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తుపాకి లైసెన్స్ కలిగివున్న ప్రతి అమెరికన్ పౌరుడు హిల్లరీ క్లింటన్ వైట్ హోస్ కు చేరకుండా ఆపగలరని వ్యాఖ్యనించారు. దీంతో ట్రంప్ హిల్లరీని కాల్చిచంపాలని సూచిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హిల్లరీ అధికారంలోకి వస్తే అమెరికన్లకు మాత్రమే వర్తించే గన్ లైసెన్స్ 'సెకండ్ అమెండ్ మెంట్'ను తొలగిస్తారని ట్రంప్ విల్మింగ్ టన్ ప్రచారకార్యక్రమంలో అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు హిల్లరీని చంపాలన్న సందేశం ఇచ్చేట్టుగా ఉన్నాయని యూఎస్ లా మేకర్స్ పేర్కొన్నారు.

రిపబ్లికన్ ప్రచారకార్యక్రమ నిర్వాహకులు ట్రంప్ వ్యాఖ్యలపై వస్తున్న వార్తలను ఖండించారు.  నిజాయితీ లేని మీడియా ట్రంప్ ప్రచారంపై ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. సెకండ్ అమెండ్ మెండ్ ద్వారా లబ్ధి పొందుతున్న ఓటర్లు రికార్డు స్థాయిలో ఉన్నారు. వారిని ఆకర్షించడానికే ట్రంప్ ఆ వ్యాఖ్య చేశారే తప్ప మరేం కాదని తెలిపారు. ప్రచార కార్యక్రమం అనంతరం ఆ వ్యాఖ్యలపై ఇంటర్వూ ఇచ్చిన ట్రంప్.. హిల్లరీ క్లింటన్ గెలిస్తే.. సెకండ్ అమెండ్ మెంట్ బిల్లును సుప్రీం కోర్టు ద్వారా రూపుమాపుతానని అన్నారు. గన్ లైసెన్స్ కలిగివున్న వాళ్లందరిలో అఖండ శక్తి ఉందని.. వారికి ఎవరికి ఓటువేయాలో బాగా తెలుసునని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement