వావ్.. ఎంత పెద్ద వడాపావో!! | Sakshi
Sakshi News home page

వావ్.. ఎంత పెద్ద వడాపావో!!

Published Wed, Aug 24 2016 1:58 PM

వావ్.. ఎంత పెద్ద వడాపావో!! - Sakshi

వడాపావ్.. నోరూరించే ఈ రుచికరమైన వంటకానికి పెట్టింది పేరు మహారాష్ట్ర... స్థానికంగా ఎక్కువగా లభ్యమయ్యే ఈ వంటకంతో కోటీశ్వరులైన వ్యాపారులు లేకపోలేదు. మహారాష్ట్రీయుల పాపులర్ స్ట్రీట్ ఫుడ్గా నిలుస్తున్న ఈ వడాపావ్ డేను గూర్గావ్లోని ప్రముఖ చైన్ రెస్టారెంట్స్ నూక్కడ్వాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది. ఎలా అనుకుంటున్నారా..?  ఆకాశమే హద్దుగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన వడాపావ్ను 145 అడుగుల్లో తయారుచేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించింది.  చెఫ్ అజయ్ సూద్ నేపథ్యంలో మొత్తం 25 మంది టీమ్ సభ్యులు మూడు రోజుల వ్యవధిలో 200 కేజీల పొటాటో, బ్రెడ్తో ఈ రుచికరమైన వంటకాన్ని ప్రిపేర్ చేశారట. మూడు గంటల్లేనే వడా పావ్ను  ఫైనల్ ప్లేటింగ్ చేసేసి రికార్డు సృష్టించారు.    


ఇలా తయారుచేసిన ఈ వంటకాన్ని వాటికా సోహనా రోడ్డులోని బిజినెస్ పార్క్లో నిర్వహించిన ఈవెంట్లో ప్రదర్శించారు.  ఈవెంట్లో పాల్గొన్న 2500 మంది ఈ వడాపావ్ను తనివితీరా ఆస్వాదించారట. వరల్డ్ వడాపావ్ డేను ప్రజలకీ తెలియపరచడానికి, తమదైన శైలిలో వడాపావ్ డేను సెలబ్రేట్ చేశామని నూక్కడ్వాలా మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ భళ్లా తెలిపారు. ఈ గ్రాండ్ వడాపావ్ తమల్ని 2018 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నిలుపుతుందని భళ్లా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.మహారాష్ట్రలో ఈ వంటకం పాపులర్ స్ట్రీట్ ఫుడ్గా నిలుస్తోంది. చాలా రెస్టారెంట్లు, కేఫ్లు ఈ డిష్ను విక్రయించడం ప్రారంభించాయి.

Advertisement
Advertisement