శిక్షను సవాల్‌ చేయనున్న గుర్మీత్‌ సింగ్‌ | Sakshi
Sakshi News home page

శిక్షను సవాల్‌ చేయనున్న గుర్మీత్‌ సింగ్‌

Published Mon, Aug 28 2017 4:02 PM

శిక్షను సవాల్‌ చేయనున్న గుర్మీత్‌ సింగ్‌

రోహ్‌తక్‌: అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన 20 సంవత్సరాల  జైలు శిక్ష తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్లు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ తరఫు న్యాయవాదులు సూచన ప్రాయంగా తెలిపారు. కోర్టు తీర్పు పూర్తి కాపీ చదివిన తరువాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని  రోహ్‌తక్‌ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఆశ్రమంలో సాధ్వీలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన గుర్మీత్‌ను కఠినంగా శిక్షించాలన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన జడ్జి జగ్‌దీప్‌ సింగ్.. దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

2002నాటి అత్యాచారం కేసును సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని, సరైన సాక్ష్యాధారాలు కూడా సమర్పించలేకపోయిందని గుర్మీత్‌ తరఫు న్యాయవాదులు ఆరోపించారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని పేర్కొన్నారు.

గుర్మీత్‌ గొప్ప సంఘ సవకుడు: సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేయడానికి ముందు వాదనలు వినిపించిన గుర్మీత్‌ సింగ్‌ న్యాయవాదులు.. బాబాను గొప్ప సంఘ సేవకుడిగా పేర్కొన్నారు. పేదల కోసం ఆయన ఎన్నో సేవలు చేశారని, వాటిని దృష్టిలో ఉంచుకుని కఠినశిక్షలేవీ వేయవద్దని న్యాయమూర్తిని కోరారు. సీబీఐ మాత్రం గుర్మీత్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది. అన్నీ విన్న జడ్జి చివరికి గుర్మీత్‌కు 10 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించారు.
(చదవండి: అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష)

 

Advertisement
Advertisement