'హెచ్-1బీ, గ్రీన్ కార్డులను పూర్తిగా మార్చేస్తాం' | Sakshi
Sakshi News home page

'హెచ్-1బీ, గ్రీన్ కార్డులను పూర్తిగా మార్చేస్తాం'

Published Thu, Mar 9 2017 2:45 PM

'హెచ్-1బీ, గ్రీన్ కార్డులను పూర్తిగా మార్చేస్తాం' - Sakshi

వాహింగ్టన్ : హెచ్-1బీ వర్క్ వీసాదారులకు,  ఉద్యోగ ఆధారితంగా జారీఅయ్యే గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత అమెరికన్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే హెచ్-1బీ వర్క్ వీసా, గ్రీన్ కార్డు కేటగిరీలలో సమూల మార్పులు తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అతి సన్నిహిమైన ఓ టాప్ అమెరికన్ సెనేటర్ చెప్పారు. బుధవారం ట్రంప్ ను కలిసిన ఆర్కాన్సాస్ టామ్ కాటన్ అనే సెనేటర్, ప్రస్తుతమున్న హెచ్-1బీ వర్క్ వీసా, గ్రీన్ కార్డు ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను, ఉత్తమమైన వ్యక్తులను తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో ఉన్నతమైన నిపుణులను అమెరికాలోకి తీసుకోవాలని అధ్యక్షుడు భావిస్తున్నారని ఆయన చెప్పారు. హెచ్-1బీ, గ్రీన్ కార్డులపై కంప్యూటర్ సైంటిస్టులు, పీహెచ్డీలు చేసిన వారిని కంపెనీలు తీసుకోవడం లేదని, ఎక్కువగా మిడ్ లెవల్ వర్కర్లనే కంపెనీలు రీప్లేస్ చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్లే సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు.  ఈ కారణంతోనే  హెచ్-1బీ, గ్రీన్ కార్డు ప్రక్రియలను పూర్తిగా సవరించాలని తాము భావిస్తున్నట్టు కాటన్ తెలిపారు. అమెరికన్ చేయలేని జాబ్ ఏదీ లేదని, సరియైన వేతనం చెల్లిస్తే, అమెరికన్లు ఏ ఉద్యోగమైనా చేస్తారని పేర్కొన్నారు. ఎక్కువ వేతనాలతో అమెరికన్లు మళ్లీ పనుల్లోకి తీసుకొచ్చేందుకే తాము  ఎక్కువగా ఫోకస్ చేశామని చెప్పారు. 

Advertisement
Advertisement