Sakshi News home page

ఆ ఫోన్ను వెనక్కిచ్చేసి ఐఫోన్ కొంటున్నారు!

Published Mon, Oct 31 2016 12:58 PM

ఆ ఫోన్ను వెనక్కిచ్చేసి ఐఫోన్ కొంటున్నారు!

గెలాక్సీ నోట్7 పేలుళ్ల దెబ్బతో శాంసంగ్కు తీవ్ర ప్రతికూలతే ఏర్పడిందని పలు రిపోర్టులొచ్చాయి. అయితే గెలాక్సీ నోట్7 రీకాల్ తర్వాత మార్కెట్లలో శాంసంగ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఓ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ సర్వేలో సగం మంది గెలాక్సీ నోట్7 యూజర్లు, తమ ఫోన్లను నగదుకు వెనక్కి ఇచ్చేసి, ఆ క్యాష్తో ఆపిల్ ఐఫోన్లను కొంటున్నారని తేలింది. 17 శాతం యూజర్లు మాత్రమే వేరే శాంసంగ్ డివైజ్ తీసుకుంటున్నారని తెలిసింది. దీంతో శాంసంగ్కు తలెత్తిన గెలాక్సీ నోట్7 సంక్షోభం వల్ల ఆ కంపెనీ కొంతమంది విధేయులను కోల్పోవాల్సి వస్తుందని ఐడీసీ పేర్కొంది. మొత్తం 1,082 మంది ఆన్లైన్ కస్టమర్లతో ఐడీసీ ఈ సర్వే చేపట్టింది.
 
వారిలో 507 మంది శాంసంగ్ స్మార్ట్ఫోన్ ఓనర్స్, 347 మంది గతంలో శాంసంగ్ యూజర్లు, 228 మంది శాంసంగ్ కాని యూజర్లు, 24 మంది ప్రస్తుత నోట్7 యూజర్లు ఉన్నారు.  అయితే భవిష్యత్తులో వచ్చే శాంసంగ్ ఫోన్లు కొనుక్కునే వాటిపై ఈ గెలాక్సీ సంక్షోభం ఉండదని చాలామంది చెప్పినట్టు తెలిపింది. స్మార్ట్ఫోన్ కాని ఇతర శాంసంగ్ ఉత్పత్తులపైనే ఈ ప్రభావం చూపదని పేర్కొన్నారు. రీకాల్ ప్రాసెస్లో కంపెనీ కస్టమర్లతో చాలా విధేయతతో ప్రవర్తిస్తుందని ఈ సర్వేలో తెలిసింది. ఆశ్చర్యకరంగా మరో విషయమేమిటంటే 13 శాతం మందికి అసలు శాంసంగ్ రీకాల్ ప్రక్రియనే తెలియదని తేలింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనతో శాంసంగ్ కంపెనీ ఆ ఫోన్లను రీకాల్ చేస్తూ.. వాటి స్థానంలో కస్టమర్లకు క్యాష్ లేదా గెలాక్సీ ఎస్7/ఎస్ 7 ఎడ్జ్లను ఆఫర్ చేస్తోంది. ఆ ఫోన్ల రీకాల్ చేపట్టి, ఉత్పత్తులనూ నిలిపివేసింది. ఎట్టిపరిస్థితుల్లో తమ ఫోన్లను వాడొద్దని ఆ కంపెనీనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

Advertisement

What’s your opinion

Advertisement