ఆ బాధ్యత మోసేందుకు రెడీ: పాండ్యా | Sakshi
Sakshi News home page

ఆ బాధ్యత మోసేందుకు రెడీ: పాండ్యా

Published Wed, Jul 5 2017 11:56 AM

ఆ బాధ్యత మోసేందుకు రెడీ: పాండ్యా

ఇటు బంతితోనూ, అటు బ్యాటుతోనూ రాణిస్తున్న హార్థిక్‌ పాండ్యా అనతికాలంలోనే మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల వరకు టీమిండియాలో విడదీయరాని భాగంగా మారాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించిన పాండ్యా ప్రస్తుత వెస్టిండీస్‌ పర్యటనలోనూ సత్తా చాటుతున్నాడు. స్థిరంగా ఆడుతున్న ఈ 23 ఏళ్ల యువ ఆటగాడు వెస్టిండీస్‌ టూర్‌లో ఐదు వికెట్లు పడగొట్టి.. తనలోని బౌలింగ్‌ ప్రతిభను చాటుకున్నాడు. బౌలింగ్‌లో రోజురోజుకు మెరుగవుతున్న పాండ్యా.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.

ముఖ్యంగా మ్యాచ్‌లను విజయవంతంగా ముగించడంలో పాండ్యా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఐసీపీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో సహచరులంతా చేతులు ఎత్తేసినా.. పాండ్యా ఒంటిచెత్తో వీరోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే, భారీ లక్ష్యం ఉండటంతో ఆ మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఇక ఇటీవల విండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలోనూ పాండ్యా నిలకడగానే ఆడినా.. 'ఫినిషింగ్‌ టచ్‌' ఇవ్వలేకపోయాడు. 190 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనీతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పాండ్యా 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే వికెట్లు టపటపా పడటంతో భారత్‌ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లు తనకు మంచి అనుభవాన్ని నేర్పించాయని, మున్ముందు భారత్‌ మ్యాచ్‌లను విజయవంతంగా ముగించే (ఫినిషింగ్‌) బాధ్యతను తాను చేపట్టేందుకు సిద్ధమని తెలిపాడు.
 

Advertisement
Advertisement