చెల్లింపుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘పేజాప్’ | Sakshi
Sakshi News home page

చెల్లింపుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘పేజాప్’

Published Thu, Jun 11 2015 1:38 AM

చెల్లింపుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘పేజాప్’

 ముంబై: నగదు చెల్లింపులకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్తగా పేజాప్ పేరిట యాప్‌ను ప్రవేశపెట్టింది. ఖాతాదారులు.. వ్యాపార సంస్థలకు చేసే నగదు బదిలీ సర్వీసులకు, షాపింగ్, బిల్లుల చెల్లింపులు, టికెట్లు బుక్ చేసుకోవడం తదితర సేవలకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి తెలిపారు. ఇది ప్రీపెయిడ్ వాలెట్‌కి భిన్నంగా ఉంటుందని వివరించారు. ఖాతాదారు డెబిట్ లేదా క్రెడిట్ కార్డును యాప్‌తో అనుసంధానించడం జరుగుతుందని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 

Advertisement
Advertisement