బుల్లెట్ వేగంతో తల మీదుగా వెళ్లింది! | Sakshi
Sakshi News home page

బుల్లెట్ వేగంతో తల మీదుగా వెళ్లింది!

Published Mon, Sep 26 2016 8:24 PM

బుల్లెట్ వేగంతో తల మీదుగా వెళ్లింది!

నెవాడా: విమానాన్ని రన్ వేపై నిలిపిన ఓ పైలట్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. గతవారం అమెరికాలో నిర్వహించిన రెనో జాతీయ ఎయిర్ రేసుల చాంపియన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. థామ్ రిచర్డ్ అనే పైలట్ రేసును పూర్తి చేసి రన్ వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు. సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని రన్ వేపైనే నిలిపివేశాడు. ఇది గమనించని మరో విమాన పైలట్ థామ్ తల మీదుగా తన విమానాన్ని రన్ వే మీద దించాడు.

 థామ్ తలపై నుంచి విమానం వెళ్లడం గమనించిన రన్ వే వద్ద సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతడిని చికిత్స నిమిత్తం తరలించారు. అయితే సాంకేతిక సమస్యల వల్లే విమానాన్ని థామ్ రన్ వే మీదే నిలిపివేసినట్లు తెలిసింది. థామ్ విమానం కాక్ పిట్ పై ఉన్న కెమెరాలో ఘటనకు సంబంధించిన వీడియో రికార్డయింది.

ఆ వీడియోను థామ్ ఇటీవల యూట్యూబ్ లో పోస్టు చేశారు. బుల్లెట్ కంటే వేగంగా విమానం తన తలపై నుంచి వెళ్లిందని థామ్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. థామ్ పోస్టు చేసిన వీడియో కొద్ది గంటల్లోనే వైరల్ అయింది.

Advertisement
Advertisement