శ్రీవారి గర్భాలయంలో రామచిలుక | Sakshi
Sakshi News home page

శ్రీవారి గర్భాలయంలో రామచిలుక

Published Sun, Sep 20 2015 10:32 AM

శ్రీవారి గర్భాలయంలో రామచిలుక

తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. స్వామి వారు ఈ రోజు మోహిని అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. బంగారువాకిలిలో నుంచి శ్రీవారి గర్భాలయంలోకి రామ చిలుక ప్రవేశించింది. మోహినీ అవతారంలో అలంకరించిన రామచిలుక వలే ఈ రామచిలుక ఉండటంతో టీటీడీ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది శ్రీవారి లీలలే అని టీటీడీ అధికారులు అంటున్నారు.

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది.18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయింది.సర్వదర్శనానికి 9 గంటలు, కాలి నడకన వచ్చే భక్తులకు 3 గంటలు సమయం పడుతోంది.  సాయంత్రం 4.00 గంటలకు స్వామి వారికి ఊంజల్ సేవ.. రాత్రి 8 గంటలకు మలయ్యప్ప స్వామికి గరుడ సేవ నిర్వహించనున్నారు. 

Advertisement
Advertisement