వైఎస్ఆర్సీపీని ఆహ్వానించండి.. | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీని ఆహ్వానించండి..

Published Mon, Aug 29 2016 4:39 PM

వైఎస్ఆర్సీపీని ఆహ్వానించండి.. - Sakshi

హైదరాబాద్: అఖిలపక్ష సమావేశాలకు వైఎస్ఆర్సీపీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలపునర్విభజన అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ వైఎస్ఆర్సీపీని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీనేత శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. శివకుమార్ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ జిల్లాల పునర్విభజనపై జరిగిన అఖిలపక్షానికి వైఎస్ఆర్ సీపీని ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement