ఐసిస్‌ను స్థాపించింది హిల్లరీయే: ట్రంప్ | Sakshi
Sakshi News home page

ఐసిస్‌ను స్థాపించింది హిల్లరీయే: ట్రంప్

Published Thu, Aug 4 2016 10:39 AM

ఐసిస్‌ను స్థాపించింది హిల్లరీయే: ట్రంప్ - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. తన డెమొక్రాటిక్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై దారుణమైన ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు దెయ్యం అని కూడా అన్న ట్రంప్.. ఈసారి ఏకంగా ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకురాలు హిల్లరీయేనని ఆయన ఆరోపించారు. అందుకుగాను వాళ్లనుంచి ఆమెకు అవార్డు రావాలని ఫ్లోరిడాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే 9/11 దాడి జరిగేది కాదని కూడా ట్రంప్ చెప్పారు.

ఆర్లాండో, శాన్ బెర్నార్డినో, వరల్డ్ ట్రేడ్ సెంటర్లలో ఏం జరుగుతోందో చూడాలని.. ఇస్లామిక్ స్టేట్ ఈ స్థాయికి రావడానికి మనమే కారణమని ఆయన చెప్పారు. క్లింటన్ చేతిలో ఓడిపోవడం చాలా దారుణంగా ఉంటుందన్నారు. ఇక రిపబ్లికన్ పార్టీలో విభేదాలు తలెత్తాయన్న కథనాలను ట్రంప్ ఖండించారు. పార్టీ మొత్తం సమైక్యంగానే ఉందని తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత సమైక్యత లేదని.. ఇప్పుడు ఇంత కలిసికట్టుగా ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలని చెప్పారు.

Advertisement
Advertisement