హిందాల్కో లాభం 31 శాతం అప్ | Sakshi
Sakshi News home page

హిందాల్కో లాభం 31 శాతం అప్

Published Wed, Nov 11 2015 1:19 AM

హిందాల్కో లాభం 31 శాతం అప్

న్యూఢిల్లీ: హిందాల్కో  నికర లాభం(స్టాండ్ ఎలోన్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 31 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.79 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.103 కోట్లకు పెరిగిందని హిందాల్కో తెలిపింది. విక్రయాలు జోరుగా ఉండడం వల్ల నికర లాభంలో ఈ స్థాయి వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,778 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.9,342 కోట్లకు పెరిగిందని వివరించింది. రియలైజేషన్లు బాగా తగ్గినా అమ్మకాలు పెరిగాయని తెలిపింది.

కంపెనీ కొత్త ఫ్యాక్టరీల్లో ఉత్పతి కార్యకలాపాల పునర్వ్యస్థీకరణ కారణంగా ఆదాయం పెరిగిందని పేర్కొంది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో ధరలు బాగా క్షీణించడం, ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, దేశీయంగా  అల్యూమినయం ధరలు తగ్గడం.. ఈ అంశాలన్నీ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలపై ప్రభావం చూపాయని వివరించింది. అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్‌లు కలుపుకొని రూ.119 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపధ్యంలో ఈ కంపెనీ షేర్ బీఎస్‌ఈలో 0.4 శాతం క్షీణించి రూ.79.45 వద్ద ముగిసింది.
 
 

Advertisement
Advertisement