‘గుజరాత్ నిఘా’పై కేంద్రం విచారణ | Sakshi
Sakshi News home page

‘గుజరాత్ నిఘా’పై కేంద్రం విచారణ

Published Mon, Dec 2 2013 1:06 AM

Home Ministry to probe Gujarat snooping row?

న్యూఢిల్లీ/ముంబై: మహిళా ఆర్కిటెక్ట్‌పై అక్రమంగా నిఘా ఉంచి  గుజరాత్‌లో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచిన వ్యవహారంపై విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2009లో అప్పటి గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి, నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షా ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు బెంగళూరులో ఉంటున్న ఒక యువతిపై నిబంధనలకు విరుద్ధంగా నిఘా సాగించినట్లు ఓ వెబ్‌సైట్ బయటపెట్టడం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాష్ట్ర యంత్రాగాన్ని దుర్వినియోగపరిచినందుకు  మోడీ ప్రాసిక్యూషన్ ఎదుర్కొనాల్సి ఉంటుందా అని ఆదివారం ముంబైలో కేంద్ర హోం మంత్రి షిండేను ప్రశ్నించగా, ఈ మొత్తం ఘటనపై విచారణ జరుపుతామని బదులిచ్చారు. ఆ తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement