భారత్లో మరో చైనా కంపెనీ తయారీ ప్లాంట్ | Sakshi
Sakshi News home page

భారత్లో మరో చైనా కంపెనీ తయారీ ప్లాంట్

Published Thu, Aug 18 2016 8:43 AM

భారత్లో మరో చైనా కంపెనీ తయారీ ప్లాంట్

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్మార్ట్ఫోన్ విక్రయదారి అయిన హువావే కూడా భారత్లో హ్యాండ్ సెట్ల తయారీకి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కార్యకలాపాలను ప్రారంభించబోతుందట. ఇంకో నెలలో ఈ ప్లాన్కు సంబంధించిన వివరాలను హువావే వెల్లడించనుంది. ప్రస్తుతం భారత్లో హ్యాండ్ సెట్ల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి లైసెన్సు పొందామని, త్వరలోనే తయారీ ప్రణాళిక వివరాలను వెల్లడిస్తామని హువావే ఇండియా కన్సూమర్ బిజినెస్ గ్రూపు అధినేత పిటర్ జాయ్ తెలిపారు. చైనా తర్వాత తమ మొబైల్ డివైజ్లకు భారత్ రెండో మార్కెట్గా ఉండాలని కంపెనీ భావిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్గా, సరియైన సమయంలో భారత్లో వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్నామని వెల్లడించింది.

భారత్ మార్కెట్లో తమ దూకుడును పెంచి, హువావే స్టోర్లను 50వేలకు పెంచుతామని పిటర్ వివరించారు. గత 16 ఏళ్లుగా హువావే భారత్లో మొబైల్ ఫోన్ల విక్రయాలు చేపడుతోంది. 1999లో బెంగళూరులో స్వతంత్ర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుచేసింది. సొంత బ్రాండెడ్ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు కూడా హువావే ప్లాన్ చేస్తోంది. కానీ ఆ ప్లాన్కు సంబంధించిన వివరాలను ఇంకా బయటికి వెల్లడించలేదు. బుధవారమే హువావే తన కొత్త స్మార్ట్ఫోన్ హువావే పీ9ను రూ.39,999లకు ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement