తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం: దిగ్విజయ్ | Sakshi
Sakshi News home page

తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం: దిగ్విజయ్

Published Sun, Aug 4 2013 11:16 AM

ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ - Sakshi

హైదరాబాద్ నగరం అటు సీమాంధ్రకు ఇటు తెలంగాణకు ఉమ్మడి రాజధాని కాదని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం అయ్యే అవకాశం కూడా లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆదివారం ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చారు.

 

10 ఏళ్ల వరకు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అంతర్బాగం అవుతుందని తెలిపారు. ఆ క్రమంలో సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. గతంలో చంఢీగఢ్ నగరాన్ని పంజాబ్కు ఇస్తామని వాగ్దానం చేశారు, కానీ చివరకు హర్యానా- పంజాబ్కు ఉమ్మడి రాజధాని అయిందని గుర్తు చేశారు. కానీ అలాంటి సంఘటన నేడు పునారావృతం కాదని ఆయన పేర్కొన్నారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయంతో సీమాంధ్రలో ఆగ్రహా జ్వాలలు మిన్నాంటాయి. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రజలు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆ క్రమంలో ఆ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అందులోభాగంగా హైదరాబాద్ నగరాన్ని రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి లేకుంటే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం కాంగ్రెస్ హైకమాండ్ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement