హైదరాబాద్-ఖింగ్దాసోదర నగరాలు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్-ఖింగ్దాసోదర నగరాలు

Published Sat, May 16 2015 2:08 AM

hyderabad-kingda twin cities

  •  చైనా, భారత్‌ల మధ్య కుదిరిన 24 కీలక ఒప్పందాలు
  • బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్, చైనాల మధ్య 24 కీలక ఒప్పందాలు కుదిరాయి. చైనాలోని చెంగ్దూ, భారత్‌లోని చెన్నైల్లో రాయబార కార్యాలయాల ఏర్పాటు సహా రైల్వే, విద్య, గనులు, ఖనిజాలు తదితర రంగాల్లో కుదిరిన ఒప్పందాలపై మోదీ, చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ల సమక్షంలో సంతకాలు జరిగాయి. సోదర రాష్ట్రాలు, సోదర నగరాలకు సంబంధించిన 4 ఒప్పందాలు కూడా అందులో ఉన్నాయి.
     ముఖ్యమైన ఒప్పందాలు
    హైదరాబాద్- ఖింగ్దా; చెన్నై- చాంగ్‌క్వింగ్; ఔరంగాబాద్- దున్హాంగ్ నగరాలను సోదర నగరాలుగా, కర్ణాటక- చైనాలోని సించువాన్ రాష్ట్రాన్ని సోదర రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందాలు.

    •      రైల్వే రంగంలో సహకారానికి సంబంధించిన కార్యాచరణపై భారతీయ రైల్వే, చైనా జాతీయ రైల్వేల మధ్య          ఒప్పందం.
    •      విద్యారంగంలో సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందం(ఎంఓయూ).
    •      అంతరిక్ష రంగంలో సహకారంపై అగ్రిమెంట్.
    •      తీరప్రాంత రక్షణలో సహకారంపై, సాగర అధ్యయనంపై ఒప్పందాలు.
    •      అహ్మదాబాద్‌లో మహాత్మాగాంధీ నైపుణ్య కేంద్రం ఏర్పాటు.
    •      దూరదర్శన్, చైనా అధికార టెలివిజన్ సీసీటీవీల మధ్య ప్రసారాలకు సంబంధించిన ఒక ఒప్పందం.
    •      యున్నన్ మింజు యూనివర్సిటీ, ఐసీసీఆర్‌ల మధ్య రెండు ఒప్పందాలు.
    •      ఫుదాన్ విశ్వవిద్యాలయంలో యోగా కళాశాల ఏర్పాటు, గాంధీయన్, ఇండియన్ స్టడీస్ సెంటర్ ఏర్పాటుపై ఒప్పందాలు.

Advertisement

తప్పక చదవండి

Advertisement