రాజకీయ నిర్ణయం వాయిదా వేసుకున్నా | Sakshi
Sakshi News home page

రాజకీయ నిర్ణయం వాయిదా వేసుకున్నా

Published Sun, Jul 12 2015 1:44 AM

రాజకీయ నిర్ణయం వాయిదా వేసుకున్నా

* వైఎస్సార్‌సీపీ నేతలకు క్షమాపణ
* మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్


సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘నా రాజకీయ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను. అస లు రాజకీయాల్లో ఉంటానో లేనో చెప్పలేను’ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. శనివారం గుంటూరులోని ఏపీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వద్ద వైఎస్సార్‌సీపీలో చేరే ప్రతిపాదనను నేనే తీసుకువచ్చాను. ఈ నేపథ్యంలో నా రాజకీయ గురువు రాయపా టి సాంబశివరావు సలహా మేరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి క్షమాపణ చెబుతున్నాను’ అని డొక్కా అన్నారు. అంబటికి కూడా క్షమాపణలు చెబుతానన్నారు.

Advertisement
Advertisement