సోషల్‌ మీడియాలో స్మృతి ఇరానీ సరికొత్త ఉద్యమం! | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో స్మృతి ఇరానీ సరికొత్త ఉద్యమం!

Published Mon, Aug 1 2016 4:15 PM

I support Indian weavers, says Smriti Irani

న్యూఢిల్లీ: దేశంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు వేశారు. బిహార్‌ నుంచి తెప్పించిన చేనేత సిల్క్‌ చీరను ధరించిన ఆమె ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అంతేకాకుండా ఐవేర్‌ హ్యాండ్లూమ్‌ యాష్‌ట్యాగ్‌ (#IWearHandloom)తో ఆమె సరికొత్త ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు కూడా చేనేత వస్త్రాలు ధరించి.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలని, ఐవేర్‌ హ్యాండ్లూమ్‌ యాష్‌ట్యాగ్‌ తో ఆ పోస్టుకు మరో ఐదుగురిని ట్యాగ్‌ చేయాలని, ఆ ఐదుగురు కూడా ఇలా చేయడం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలువాలని ఆమె కోరారు.

ఎంతో ఘనవైభవం కలిగిన చేనేత రంగం ఇప్పుడు అనేక కష్టాలతో సతమతమవుతున్నది. మొన్నటివరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా ఉండి పలు వివాదాలు ఎదుర్కొన్న స్మృతిని ఆ శాఖ నుంచి తప్పించి.. కేంద్ర జౌళి శాఖకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత రంగం అభివృద్ధికి ఆమె సంకల్పించారు.  
 

Advertisement
Advertisement