ప్రత్యర్థులను చాలా సీరియస్గా తీసుకుంటా: ప్రధాని | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థులను చాలా సీరియస్గా తీసుకుంటా: ప్రధాని

Published Fri, Dec 6 2013 2:53 PM

ప్రత్యర్థులను చాలా సీరియస్గా తీసుకుంటా: ప్రధాని

ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పారు. ప్రతిపక్షాల శక్తిని తక్కువగా అంచనా వేయకూడదని, పూర్తిగా సంతృప్తిచెందినట్లు భావిస్తే ఏమాత్రం కుదరదని పార్టీ వర్గాలకు చెప్పారు. వ్యవస్థీకృత రాజకీయ పార్టీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాల శక్తిని తక్కువగా అంచనా వేయకూడదని, అలా చేసి మన ఓడను మనమే ముంచేసుకోకూడదని ఆయన అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గురించిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. ప్రతిపక్షాలను తాను చాలా సీరియస్గా తీసుకుంటానని ప్రధాని వివరించారు.

నరేంద్రమోడీ విషయంలో కాంగ్రెస్ నాయకులు తలోమాట చెబుతున్నారు. మోడీ కాంగ్రెస్కు సవాలుగానే నిలుస్తారని, అయితే చాలా విషయాల్లో ఆయన అస్పష్టంగా ఉంటారని ఆర్థికమంత్రి చిదంబరం గతంలో వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాతి రోజే హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ మోడీ అసలు కాంగ్రెస్ పార్టీకి సవాలే కాదన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చాలావరకు సర్వేలు అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు ఆదివారం రానున్నాయి. అయితే, ఈ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధం లేదని ప్రధాని అంటున్నారు. తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో 2014 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్నామని, ఈ ఎన్నికల ఫలితాలను చూసి ఏదో అనుకుంటే మాత్రం పొరపాటేనని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement