‘సంతోషంగా అంగీకరిస్తా’ | Sakshi
Sakshi News home page

‘సంతోషంగా అంగీకరిస్తా’

Published Thu, May 18 2017 7:51 PM

‘సంతోషంగా అంగీకరిస్తా’

న్యూఢిల్లీ: కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్టే విధించడాన్ని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్వాగతించారు. ఈ కేసు విచారణలో పాకిస్తాన్‌ అనుసరించిన విధానం సవ్యంగా లేదని ఆయన విమర్శించారు. కులభూషణ్.. భారత రాయబారిని కలిసిన తర్వాత అతడికి విధించిన మరశిక్షపై అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అతడికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. జాధవ్‌ కుటుంబానికి సాయం చేసేందుకు సంతోషంగా అంగీకరిస్తానని చెప్పారు.

కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే విధించడం పట్ల దేశం చాలా సంతోషంగా ఉందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌధరి వ్యాఖ్యానించారు. జాధవ్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ వద్ద ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అతడికి వ్యతిరేకంగా సాగిన విచారణ చట్టవిరుద్ధమని, దుర్మార్గమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement