ఆదర్శాల కోసం కృషి చేయాలి : ప్రణబ్ | Sakshi
Sakshi News home page

ఆదర్శాల కోసం కృషి చేయాలి : ప్రణబ్

Published Fri, Aug 14 2015 7:43 PM

ఆదర్శాల కోసం కృషి చేయాలి : ప్రణబ్

న్యూఢిల్లీ : బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆదర్శాల కోసం కృషి చేయాలని దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  పిలుపు నిచ్చారు. శనివారం 69వ భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేశించి  ప్రసంగించారు. భారతీయులు ఆత్మగౌరవం కోసం స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేశారని ఆయన వివరించారు. మనకు పటిష్ఠమైన రాజ్యాంగం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైనదని ఈ సందర్భంగా ప్రణబ్ పేర్కొన్నారు. విలువైన చర్చలకు వేదికగా పార్లమెంట్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే విద్య, ఉద్యోగాలు మహిళలకు అందేలా చట్టాలను మార్చుకున్నామని చెప్పారు.   

ప్రాచీనమైన చట్టాలను రద్దు చేసి మన అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చుకున్నామని ప్రణబ్ ఈ సందర్భంగా విశదీకరించారు. మానవునికి - ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ప్రణబ్ వివరించారు. తీవ్రవాదులకు మతం, సిద్ధాంతం, భాష అంటూ ఏమీ లేవన్నారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు సహకరించ కూడదని పొరుగుదేశాలు గుర్తించాలన్నారు. భారత్ - బంగ్లాదేశ్లో మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారమైందన్నారు. నోబెల్ పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థికి ఈ సందర్భంగా ప్రణబ్ అభినందనలు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement