భారత్ -పాకిస్తాన్ సమావేశాలు రద్దు | Sakshi
Sakshi News home page

భారత్ -పాకిస్తాన్ సమావేశాలు రద్దు

Published Mon, Aug 18 2014 7:51 PM

భారత్ -పాకిస్తాన్ సమావేశాలు రద్దు

న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో భారత్-పాకిస్తాన్ ల మధ్య జరుగనున్న విదేశాంగ కార్యదర్శల సమావేశం రద్దయింది. ఈ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు సోమవారం భారత్ స్పష్టం చేసింది. ఆగస్టు 25 వ తేదీన పాకిస్తాన్ లోని విదేశాంగ కార్యదర్శల సమావేశం పాల్గొనాల్సిన భారత్ తన పర్యటనను ఆకస్మికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కాశ్మీర్ సమస్య ప్రధాన కారణం. జమ్మూ-కాశ్మీర్ అంశంపై పాక్ పదేపదే జోక్యం చేసుకోవడంపై భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ అంతరంగీక వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యాన్ని సహించబోమని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పాకిస్తాన్ హై కమీషన్ అబ్దుల్ బాసిత్ ఏర్పాటు వాద చర్చలకు తెరలేపిన అనంతరం భారత్ పర్యటనను రద్దు చేసుకుని గట్టి హెచ్చరికలు పంపింది.

 

మళ్లీ పాకిస్తాన్ అందుకు అనుగుణగా మరోసారి చర్చలు జరపడానికి ప్రణాళిక సిద్ధం చేసిన సమయంలో భారత్ తన తిరుగుబాటు జెండా ఎగురవేసింది.ఇదిలా ఉండగా పాకిస్తాన్ తాజా వైఖరి అనేక రకాలైన ప్రశ్నలను ఎత్తిచూపేదిగా ఉందని భారత విదేశాంగ ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. కాగా, పాకిస్తాన్ తరుచు భారత జవాన్లపై కాల్పుల జరిపి ఇరుదేశాల మధ్య ఉన్న విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది.

Advertisement
Advertisement