బహుమతి మాకొద్దు: భారత్‌ | Sakshi
Sakshi News home page

బహుమతి మాకొద్దు: భారత్‌

Published Thu, Jan 19 2017 7:57 PM

బహుమతి మాకొద్దు: భారత్‌ - Sakshi

న్యూఢిల్లీ: అణుశక్తి సరఫరా బృందం(ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వాన్ని అమెరికా భారత్‌కు బహుమతిగా ఇవ్వాలని చూస్తోందని చైనా చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ స్పందించింది. బహుమతిగా ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వాన్ని భారత్‌ కోరుకోవడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వానికి భారత్‌ యత్నిస్తుండగా.. ఎన్‌పీటీపై సంతకం చేయకుండా ఎలా సభ్యుడిగా చేర్చుకుంటారని చైనా మోకాలు అడ్డుపెడుతోంది.
 
కాగా, రాయబారి రిచర్డ్‌ వర్మ మాత్రం ట్రంప్‌ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనా అడ్డంకిని అధిగమించి భారత్‌ కు ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వాన్ని కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ కూడా ఎన్‌ఎస్‌జీలో సభ్వత్వాన్ని కోరుతుండటంతో చైనా ఆ దేశంతోనూ సంప్రదింపులు జరుపుతోంది.

Advertisement
Advertisement