మీరు నిజంగా భారత పౌరులేనా ? | Sakshi
Sakshi News home page

మీరు నిజంగా భారత పౌరులేనా ?

Published Tue, Aug 5 2014 12:42 PM

మీరు నిజంగా భారత పౌరులేనా ? - Sakshi

భారత్లో అక్రమ వలసదారుల పని పట్టేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా దేశ పౌరులను భారతీయ పౌరసత్వ గుర్తింపు కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు తుది రూపు దిద్దుకుంటుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల లోక్సభలో ఇదే అంశంపై  ఓ ప్రకటన చేశారు. ఈ కార్డుల వల్ల పౌరులకు కలిగే ప్రయోజనాలను ఆయన ఈ సందర్బంగా విశదీకరించారు. ఈ కార్డుల వల్ల దేశంలో ఎవరు భారతీయ పౌరులు, ఎవరు అక్రమంగా దేశంలో నివసిస్తున్నారనే విషం తేటతెల్లమవుతుందని తెలిపారు.

దేశంలో దాదాపు 85 శాతం మంది భారతీయులు ఉండగా... 2 శాతం మంది విదేశీయులు దేశంలో అక్రమంగా నివసిస్తున్నారని 2009లో దేశంలో నిర్వహించిన ఓ సర్వే నివేదికను రాజనాథ్ సింగ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ విదేశీయులలో చాలా మంది వీసా కాలపరిమితి ముగిసిన దేశంలో ఉండి పోతున్నారని చెప్పారు. అలాంటి వారిని గుర్తించి వారిని స్వదేశాలకు పంపడమా ? లేక వర్క్ వీసా జారీ చేయడం కానీ జరుగుతుందని తెలిపారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఆధారంగా డేటా బేస్ సేకరిస్తామని వివరించారు. 2018 నాటికి దేశంలోని పౌరులందరికి భారతీయ పౌరసత్వ గుర్తింపు కార్డులు అందుతాయని వివరించారు.

ఈ కార్డుల జారీ కోసం సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆధార కార్డుకు భారతీయ పౌరసత్వ గుర్తింపు కార్డుకు సంబంధమే లేదని రాజనాథ్ స్పష్టం చేశారు. అదికాక ఆధార్ కార్డు బయోమెట్రిక్ విధానంతోపాటు రేషన్ కార్డు, కరెంట్ బిల్లుల ఆధారంగా జారీ చేశారని... కానీ భారతీయ పౌరసత్వ గుర్తింపు కార్డు మాత్రం ఓ వ్యక్తి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో నివసిస్తున్నవారిని ప్రాతిపదికగా చేసుకుని జారీ చేస్తామని చెప్పారు. ఆధార్ వల్ల నగదు బదిలీతోపాటు మరి కొన్ని పథకలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. భారతీయ పౌరసత్వ గుర్తింపు కార్డు అలా కాదని ... దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడమే అని రాజనాథ్ సింగ్ విశదీకరించారు.

 

Advertisement
Advertisement