గ్యాంగ్ లీడర్ చౌదరికి 12 ఏళ్ల జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ లీడర్ చౌదరికి 12 ఏళ్ల జైలు శిక్ష

Published Thu, Jul 3 2014 3:23 PM

గ్యాంగ్ లీడర్ చౌదరికి 12 ఏళ్ల జైలు శిక్ష

మహిళల అక్రమ రవాణా కేసులో భారతీయ సంతతికి చెందిన గ్యాంగ్లీడర్ విశాల్ చౌదరి (35) కి బ్రిటన్ కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 100 మందికి పైగా మహిళలను బ్రిటన్ తరలించడమే కాకుండా వారితో బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు విశాల్పై నమోదైన నేరం రుజువైందని పేర్కొంది. విశాల్తోపాటు అతడికి సహాకరించిన నలుగురితోపాటు మరో మహిళకు లండన్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది.

 

నిందితులలో విశాల్ సోదరుడు కునాల్ చౌదరికి 5 ఏళ్లు, మహిళ సిజల్వియా అబెల్ 3 ఏళ్లు, ఆమె సోదరుడు క్రిస్జిటియన్ అబెల్ 10 ఏళ్లు, అట్టిల్లా కోవాస్ 6 ఏళ్లు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం ఆరోపణలపై విశాల్, కునాల్ చౌదరిలతోపాటు మరో ముగ్గురుని గతే ఏడాది మొదట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బిబిసి ఓ కథనాన్ని వెలువరించింది.

Advertisement
Advertisement