Sakshi News home page

ఉగ్రవాద ఆరోపణలతో భారత సంతతి మహిళ అరెస్టు

Published Thu, Jan 30 2014 1:09 PM

Indian-origin woman arrested in London on terror charges

భారత సంతతికి చెందిన ఓ మహిళను లండన్లో ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ అనంతరం కుంతల్ పటేల్ (36)ను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు, ఉగ్రవాద నిరోధ అధికారులు కలిసి శని, ఆది వారాలలో లండన్లోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అనంతరం తగిన ఆధారాలు లభించడంతో కుంతల్ పటేల్ను అరెస్టు చేశామన్నారు. ఆమెను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తెలిపారు.

దక్షిణ లండన్లోని స్ట్రీట్హామ్ హిల్ ప్రాంతంలో గల వయట్ పార్క్ రోడ్డులోని రెండు ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. దాంతోపాటు స్ట్రాఫర్డ్లో కూడా సోదాలు చేసి, అక్కడే కుంతల్ను అరెస్టు చేశారు. ఓ బ్రిటిష్ దౌత్యవేత్త కుమారుడిని (19) కూడా పోలీసులు ఇదే సందర్భంలో అరెస్టు చేశారు. అయితే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ చెప్పలేదు. తర్వాత బుధవారం రాత్రి కుంతల్ పటేల్పై ఆరోపణలు చేశారు. వీరిద్దరినీ ఉగ్రవాద నిరోధ, నేర నిరోధ, భద్రతా చట్టం -2011 కిందే అరెస్టు చేశారు. కుంతల్ పటేల్ బ్యాంకర్ కాగా, ఆమె తల్లి మీనా పటేల్ ఓ మేజిస్ట్రేట్. వీరి కుటుంబం చాలా గౌరవప్రదమైనదని, కుంతల్, ఆమె చెల్లెలు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేప్పటి నుంచి తనకు తెలుసని వారి కుటుంబ సన్నిహితుడు ఒకరు తెలిపారు. అయితే వీరిపై ఉగ్రవాద ఆరోపణలు చేయడానికి కారణాలేంటో, పోలీసులకు లభించిన ఆధారాలేంటో మాత్రం ఇంకా తెలియరావడంలేదు.

Advertisement
Advertisement
Advertisement