అమెజాన్‌కు చెక్‌..ఫ్లిప్‌కార్ట్‌ మెగాడీల్‌ | Sakshi
Sakshi News home page

అమెజాన్‌కు చెక్‌..ఫ్లిప్‌కార్ట్‌ మెగాడీల్‌

Published Mon, Apr 10 2017 4:51 PM

అమెజాన్‌కు చెక్‌..ఫ్లిప్‌కార్ట్‌ మెగాడీల్‌ - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్   మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే  మెగా డీల్‌ సాధించింది.  ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం  ఈబేను కొనుగోలు చేసింది.  ఇటీవల భారీగా నిధుల  సమీకరణను  చేపట్టబోతోందన్న ఊహాగాలను తెరదించుతూ ఫ్లిప్‌ కార్ట్‌ ఈ మెగాడీల్ వివరాలను  సోమవారం ప్రకటించింది.   టెన్సెంట్, ఇ-బే,  మైక్రెసాఫ్ట్‌ల నుంచి భారీ పెట్టుబడులను సాధించినట్టు వెల్లడించింది.  సుమారు 11.6బిలియన్‌ డాలర్లు(75 వేలకోట్ల రూపాయలు) ఎన్ఎస్ఇ లోఅన్ని రిటైల్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ను  అధిగమించనుంది.  ఈ డీల్‌తో తన ప్రధాన ప్రత్యర్థి అమెజాన్‌కు  గట్టి  పోటీ ఇవ్వనుంది. అలాగే దేశీయ ఈ కామర్స్‌ వ్యాపారంలో  అతిపెద్ద  ఒప్పందంగా నిలవనుందని మార్కెట్ వర్గాలు  భావిస్తున్నాయి.

అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఈ–కామర్స్‌ మార్కెట్‌ వాటా కన్నేసిన ఈబే భారత్‌లోని వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది.  ఈ డీల్‌ ద్వారా  భారీ పెట్టుబడులకు తెరలేచింది.  సుమారు1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను  ఫ్లిప్‌కార్ట్‌ సమకూర్చుకోనుంది.    

చైనాకి చెందిన టెన్సెంట్, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ , ఈబే నుంచి సుమారు 1.4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సాధించింది.  టెన్సెంట్‌  వ్యూహాత్మకంగా భాగస్వామిగా  ఉండనుంది.  ఈబే  ఫ్లిప్‌కార్ట్‌ లో   స్వతంత్ర సంస్థగా  కొనసాగనుంది.  తన వాటాను విక్రయించిన సంస్థ  ఫ్లిప్‌కార్ట్‌లో ఇకపై నగదు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది.  ప్రతిపాదిత డీల్‌ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాల కోసం 500 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనుంది.

తమతో ఇన్నోవేషన్‌ పవర్‌హౌస్‌లు జత కలవడం చాలా సంతోషంగా ఉందని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. తమకు సంబంధించిఇది ఒక  ఒక మైలురాయి ఒప్పందమని  ఫౌండర్లు  సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్స్‌ల్ ప్రకటించారు. 

కాగా  2007 లో లాంచ్‌ అయిన ఫ్లిప్‌క్లార్‌ 100  మిలియన్ల యూజర్లను కలిగి ఉంది.  ఇటీవల  భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌  విస్తరణలో భాగంగా  1.5–2 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించే  ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement