ఐటీ+ఐటీ= ఐటీ | Sakshi
Sakshi News home page

ఐటీ+ఐటీ= ఐటీ

Published Wed, May 10 2017 12:41 PM

ఐటీ+ఐటీ= ఐటీ - Sakshi

న్యూఢిల్లీ: ఈ-గవర్నెన్స్‌తో ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐటీ రంగంలో భవిష్యత్తు మన దేశానిదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో డిజిటల్‌ వ్యవస్థ ఐసీఎంఐఎస్‌(ఇంటిగ్రేటెడ్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం)ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ ఆర్థిక వాతావరణాన్ని మార్చేసే శక్తి టెక్నాలజీకి ఉందన్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పేదలకు న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే దాని ప్రయోజనాలు అందరికీ అందుతాయన్నారు. ఈ-గవర్నెన్స్‌.. సులువు, ప్రభావశీలం, చవకైందే కాకుండా పర్యావరణహితమైందని చెప్పారు. కాగిత రహిత కార్యాలయాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. కృత్రిమ నిఘా ప్రభావం పెరుగుతోందని, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే శక్తి టెక్నాలజీకి ఉందన్నారు. ఐటీ+ఐటీ=ఐటీ అని భాష్యం చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఇండియన్‌ టాలెంట్‌(ఐటీ) కలిస్తే ఇండియా టుమారో(ఐటీ) అవుతుందని ప్రధాని మోదీ వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement