3 వేలమంది ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్ | Sakshi
Sakshi News home page

3 వేలమంది ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్

Published Mon, Aug 15 2016 12:37 PM

3 వేలమంది ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్

బెంగళూరు : దేశీయ రెండో అతిపెద్ద సాప్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్కు కేటాయించిన తన మేజర్ కాంట్రాక్టును రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాంట్లాండ్(ఆర్బీఎస్) రద్దుచేసింది. ఈ కాంట్రాక్ట్ను రద్దుతో కంపెనీలో 3 వేల మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నట్టు తెలుస్తోంది. అంతేకాక ఈ ప్రాజెక్టు నష్టంతో 40 మిలియన్ డాలర్ల రెవెన్యూలకు ప్రమాదం కూడా వాటిల్లనుంది. యూకేలో విడిగా బ్యాంకును ఏర్పాటుచేయాలన్న ఆలోచనతో 300 మిలియన్ యూరోల విలియమ్స్ అండ్ గ్లిన్ ఐటీ కాంట్రాక్ట్ను ఇన్ఫోసిస్కు, ఐబీఎమ్కు ఆర్బీఎస్ అప్పజెప్పింది.ఆ కాంట్రాక్టులో మేజర్ పోర్షన్ 200 మిలియన్ డాలర్లు ఇన్ఫోసిస్ కే దక్కింది.    

అయితే యూకే బ్యాంకు- విలియమ్స్ అండ్ గ్లిన్ను ప్రత్యేక స్వతంత్ర బ్యాంకుగా ఏర్పాటుచేసే ప్రణాళికను ఆర్బీఎస్ రద్దు చేయడంతో ఈ కాంట్రాక్టును ఇన్ఫోసిస్ కోల్పోయింది.  విలియమ్స్ అండ్ గ్లెన్ పేరిట స్టాండలోన్ బ్యాంకును కేవలం యూకేకు పరిమితం చేయాలని భావించిన ఆర్బీఎస్కు సహకరించేలా దాదాపు 3వేల మంది ఇన్ఫోసిస్ టెక్కీలు పనిచేస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టు రద్దుతో వీరందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఆర్బీఎస్ ప్రకటన అనంతరం ఇన్ఫోసిస్ కూడా వచ్చే కొన్ని నెలలో 3వేల ఉద్యోగులకు స్వస్తి పలుకనున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా ఈ ఉద్యోగాల కోత భారత్లో ఉండనున్నట్టు తెలుస్తోంది.

డబ్ల్యూ అండ్ జీ ప్రొగ్రామ్ టెక్నాలజీ పార్టనర్గా ఇన్ఫోసిస్ కన్సల్టింగ్, అప్లికేషన్ డెలివరీ, టెస్టింగ్ సర్వీసులను అందిస్తోంది.అయితే ఇప్పటికే రెవెన్యూలు పెంచుకోవడంలో నిరాశలో ఉన్న ఇన్ఫీకి, ఈ కాంట్రాక్టు రద్దు రెవెన్యూలపై మరింత గండికొట్టనుంది. 40-50 మిలియన్ డాలర్ల రెవెన్యూలను ఇన్ఫీ కోల్పోతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నష్టం మరోమారు కంపెనీ గైడెన్సు తగ్గించుకునేందుకు దారితీస్తుందని వెల్లడవుతోంది. ఏప్రిల్లో ఇన్ఫోసిస్ 11.5-13.6 శాతంగా ఉన్న గైడెన్సును 10.-12 శాతానికి తగ్గించింది.

Advertisement
Advertisement